Watch: మా ఎన్నికల్లో అభ్యర్థుల బాహాబాహీ.. ఉద్రిక్తతలు, తోపులాటలు
మా పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ మెంబర్స్ తీరుపై మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్‌లో నమూనా బ్యాలెట్ పేపర్‌ను శివా రెడ్డి పలువురికి ఇవ్వడాన్ని నటుడు శివబాలాజీ అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే మాటా మాటా పెరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు.