Suhas Interview Vijay Sethupathi | #Maharaja Movie Promotions | విజయ్ సేతుపతితో సుహాస్ ఇంటర్వ్యూ | ABP Desam
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSuhas Interview Vijay Sethupathi | విజయ్ సేతుపతితో సుహాస్ ఇంటర్వ్యూ... కంటెంట్ ఉన్న ఇంటర్వ్యూ తప్పక చూడాల్సిందే..! |
విజయ్ సేతుపతి.. తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు ఆయన. చేసింది కొన్ని సినిమాలే అయినా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అయితే, ఆయన మాత్రం నందమూరి బాలకృష్ణ ఫ్యాన్ అంట. బాలకృష్ణ అంటే చాలా అభిమానం అని, ఆయన చాలా ఇంప్రెస్ చేశారని చెప్పారు విజయ్ సేతుపతి. ఆయన నటించిన సినిమా 'మహారాజా' తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన బాలకృష్ణ గురించి మాట్లాడారు? ఇక ఇదే ప్రెస్ మీట్ లో విజయ్ సేతుపతి పవన్ కల్యాన్ గురించి కూడా మాట్లాడారు. ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో గెలవడంపై ఆయన స్పందించారు. పవన్ కల్యాణ్ చాలా కష్టపడ్డారని అన్నారు విజయ్. నిజానికి పవన్ గురించి తనకు తెలియదని, తన కాంటాక్ట్స్ లో కొంతమంది తెలుగు వాళ్లు పవన్ కల్యాణ్ స్టేటస్ లు పెడితే చూశానని అన్నారు. ఆయన మాస్ హీరో అంటూ కొనియాడారు.