Rajanikanth At Gannavaram Airport |Chandrababu swearing-in ceremony | విజయవాడలో ల్యాండ్ ఐన రజనీ|

Rajanikanth At Gannavaram Airport |Chandrababu swearing-in ceremony | 

ఏపీ నూతన గా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోతున్న కార్యక్రమానికి నటుడు రజనీకాంత్ హాజరుకానున్నారు. ఇందుకోసం... ఇప్పటికే గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. బుధవారం (జూన్ 12) ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు విజయవాడ శివారులోని గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న మేధ ఐటీ పార్కు వద్ద జరిగే భారీ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ప్రమాణం చేయనున్నారు. ఇంకా 26 మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే వేదికపై మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

ప్రమాణ స్వీకార వేడుకకు హాజరయ్యే వారికి కొన్ని సూచనలు కూడా చేశారు. కార్యక్రమానికి వచ్చేవారు ఈ ఆహ్వాన పత్రిక తప్పకుండా తీసుకురావాలి. వారికి కేటాయించిన స్థలంలో ఉదయం 9.30 గంటల కల్లా కూర్చోవాలని సూచించారు. ఈ ఆహ్వాన పత్రిక ఇతరులకు బదిలీ చేయకూడదని.. ఒక ఆహ్వాన పత్రికపై ఒకరు మాత్రమే ప్రవేశానికి అర్హులని వివరించారు. ఈ కార్డు నకిలీని క్రియేట్ చేసే వీలు లేకుండా దానిపై ఏపీ ప్రభుత్వ హోలోగ్రామ్‌ను కూడా ఉంచారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola