KA Paul about Pawan Kalyan oath taking as deputy cm | Chandrababu ప్రమాణస్వీకారంపై కేఏ పాల్ కామెంట్స్ | ABP Desam

KA Paul about Pawan Kalyan oath taking as deputy cm  | చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోదీ వస్తున్నారు కాబట్టి.. అదే స్టేజీపై ఏపీకి ప్రత్యేక హోదా గురించి గట్టిగా అడగాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఏపీకి ఇదే మంచి సమయం.. చంద్రబాబు,పవన్ లు ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలని ఆయన సూచించారు.

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగిసింది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. ఇటు ఎన్డీయే కూటమి ఆదివారం కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ సారథ్యంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈసారి మోడీ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు లభించింది. వీరిలో మగ్గురు బీజేపీ నాయకులు కాగా.. మరో ఇద్దరు ఎన్డీయే కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీకి చెందినవారు. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం నుంచి ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన భూపతిరాజు శ్రీనివాస వర్మ ఉన్నారు.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola