Srinuvaitla With Gopichand | గోపిచంద్ తో శ్రీనువైట్ల కొత్త మూవీ ప్లాన్ చేస్తున్నారా..?|ABP Desam
శ్రీనువైట్ల...! తెలుగు సినిమాలో ఈ డైరెక్టర్ ది ఓ ప్రత్యేకమైన స్టైల్. కామెడీకి కమర్షియ ల్ టచ్ ఇచ్చి.. బ్లాక్ బాస్టర్లు అందించడంలో శ్రీనువైట్ల మంచి రికార్డు ఉంది. ‘ఢీ’, ‘రెడీ’, ‘దూకుడు’ వంటి విజయవంతమైన సినిమాలతో బాక్సాఫీస్ ముందు జోరు చూపించిన ఆయన.. ‘ఆగడు’, ‘మిస్టర్’, ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రాలతో వరుస పరాజయాలు అందుకున్నారు. దీంతో.. ఆయన సినిమాల వేగం తగ్గించారు. ఆ మధ్య మంచు విష్ణుతో ‘ఢీ’ సీక్వెల్ చేయనున్నట్లు ప్రకటించారు. శ్రీనువైట్ల తదుపరి ప్రాజెక్ట్ అదే ఉంటుందని అంతా భావించారు. కానీ,ఎందుకో తెలియదు కానీ అది పట్టాలెక్కలేదు. దీంతో.. శ్రీనువైట్ల మరో ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.