Sharwanand on Pawan kalyan | ఏపీలో కూటమి అఖండ విజయంపై శర్వానంద్ రియాక్షన్

Continues below advertisement

ఏపీలో అఖండ విజయం సాధించిన కూటమి నేతలకు నటుడు శర్వానంద్ శుభాకాంక్షలు తెలిపారు. మనమే ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన..పవన్ కల్యాణ్ విజయంపై మాట్లాడారు.

'మనమే' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ''యాక్చువల్లీ... ఈ ఫంక్షన్ ముందుగా ఇదే రోజు పిఠాపురంలో చేద్దామని అనుకున్నాం. కానీ, అనుమతులు రాలేదు. మొన్నెప్పుడో అడిగాం. మా నిర్మాత విశ్వ ప్రసాద్ గారు ప్లాన్ చేస్తే... పిఠాపురంలో సక్సెస్ పార్టీ చేయాలని ఉంది. మన సినిమా పార్టీ పిఠాపురంలో జరగాలని నా కోరిక. సో, సక్సెస్ కొట్టిన పిఠాపురంలో కలుద్దాం'' అని శర్వానంద్ చెప్పారు.


ఏపీలో ఘనవిజయం సాధించిన కూటమి నేతలకు, తెలుగు దేశం అండ్ జనసేన పార్టీ అధినేతలకు 'మనమే' ప్రీ రిలీజ్ వేడుకలో శర్వానంద్ కంగ్రాట్స్ చెప్పారు. ''ముందుగా 'మనమే వస్తాం' అని చెప్పి మరీ నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ గారికి, పిఠాపురం ఎమ్మెల్యేగా విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాభినందనలు. చాలా సంతోషంగా ఉంది. మా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చెప్పినట్టు... ఆయన (పవన్)ది పదేళ్ల కష్టం. కష్టపడితే ఫలితం ఉంటుంది. ఆయన కష్టపడినది మన కోసం. ఆ ఫలితం చూశాం'' అని శర్వా చెప్పారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram