'Sardar' Karthi : పరుత్తివీరన్ దగ్గర నుంచి సర్దార్ వరకూ డిఫరెంట్ కథలకు కేరాఫ్ అడ్రస్ గా కార్తీ
ఓటీటీల రాకతో కంటెంట్ కు కొదవ లేదు. వ్యూయర్స్ పరిధి పెరిగింది. ఇప్పుడు భాష ఏమాత్రం అడ్డు కాదు. వేర్వేరు దేశాల్లో వచ్చిన సినిమాలు కూడా చూస్తున్నారు. ఇలాంటి సిచ్యుయేషన్ లో ఓ యాక్టర్ నిరూపించుకోవాలంటే మాత్రం అందుకు కచ్చితంగా మంచి కంటెంట్ ఉన్న కథలు కావాల్సిందే. ఈ పెరామీటర్స్ అన్నీ బాగా ఫాలో అవుతాడు కాబట్టే కార్తీ అంత మంచి పేరు సంపాదిస్తున్నాడు.