Rakul Preet Wedding: త్వరలో రకుల్ ప్రీత్ వివాహం..! ఇన్‌స్టా పోస్ట్‌తో రచ్చరచ్చ

టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ పుట్టినరోజు వేడుకులు ఘనంగా జరిగాయి. నటి 31వ బర్త్ డే వేడుకను ముంబైలో సెలబ్రేట్ చేసుకుంది. క్యారవాన్‌లో కేక్ ఏర్పాటు చేసిన రకుల్ టీమ్ ఆమెను సర్ ప్రైజ్ చేసింది. మరోవైపు బర్త్ డే నాడు రకుల్ స్వీట్ షాకిచ్చింది. తన ప్రియుడితో కలిసున్న ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఆ పోస్టును బట్టి ఆమె త్వరలోనే ప్రియుడు జాకీ భగ్నానీతో ఏడడుగులు వేయబోతున్నట్టు అర్థమవుతోంది.  జాకీ భగ్నానీ అనే నటుడితో ఆమె కొంత కాలంగా ప్రేమలో ఉంది. వీరిద్దరూ తమ ప్రేమను పెళ్లిగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారని సమాచారం. రకుల్ తన 31 పుట్టినరోజు సందర్భంగా ప్రేమ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola