MAA Elections Results: మంచు విష్ణు విజయంపై మోహన్ బాబు ఏమన్నారంటే..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయంపై మోహన్ బాబు స్పందించారు. ఇది ఒక్కరి విజయం కాదు.. అందరు సభ్యుల విజయం. మా సభ్యుల అందరి విజయంగా అభివర్ణించారు. బాబా ఆశీస్సులు, మా సభ్యుల ఆశీస్సులతో మంచు విష్ణు ముందుకు సాగుతాడు. నా బిడ్డ వంద శాతం విజయాన్ని సాధిస్తాడు. చెప్పినవి చెప్పినట్లుగా చేసి తీరుతాడు. జరిగింది మరిచిపోదాం. అందరూ ఒకతల్లి బిడ్డల్లా కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఇలా జరగకూడదని ఆకాంక్షించారు. అందరం కలిసి చర్చించుకుని ఏకగ్రీవంగా మా అధ్యక్షుడిని ఎన్నికుందామని చెప్పారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola