MAA Election: ఆలింగనం చేసుకున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు
ఆదివారం జరిగిన ఎన్నికల్లో మాత్రం ‘మా’ సభ్యులంతా కూల్‌గా మారిపోయారు. ఎన్ని గొడవలున్నా.. మేము.. మేము ఒకటే అన్నట్లుగా కలిసిపోయారు. మోహన్ బాబు ఎదురు కాగానే ప్రకాష్ రాజ్ ఆయన కాళ్లకు మొక్కేందుకు ప్రయత్నించారు. మోహన్ బాబు వద్దని వారించి.. తన కొడుకు మంచి విష్ణుతో షేక్ హ్యాండ్ ఇప్పించారు. దీంతో విష్ణు, ప్రకాష్ రాజ్ హగ్ చేసుకున్నారు.