Prabhas: ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రభాస్ కోటి రూపాయల విరాళం.
ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం ఇవ్వనున్నట్టు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వెల్లడించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ను అనూహ్య వర్షాలు, వరదలు ముంచెత్తాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో ప్రజల జీవితం అస్తవ్యస్తం అయ్యింది. ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లను ఆదుకోవడానికి ప్రభుత్వానికి ప్రభాస్ కోటి రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. త్వరలో ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి అందజేయనున్నారు.