నేను ఎన్టీఆర్ కొడుకుని....ఆయన ఫ్యాన్స్ లో ఒకడిని అంటూ బాలయ్య భావోద్వేగం

ముఖ్యంగా తప్పుడు ప్రచారం... వెన్నుపోటు పొడిచారు అంటూ. చెబుతుంటే కళ్లలో నీళ్లు వస్తాయి. ఎందుకంటే... నేను ఆయన కొడుకుల్లో ఒకడిని, నేను ఆయన ఫ్యాన్స్‌లో ఒక‌డిని' -  ఇవీ నందమూరి బాలకృష్ణ చెప్పిన డైలాగులు... అన్‌ స్టాపబుల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌లో నందమూరి బాలకృష్ణ అసలు విషయంపై స్పందించారు.   ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ షో.. నాలుగో ఎపిసోడ్‌కు అఖండ యూనిట్ హాజరైంది. నటుడు శ్రీకాంత్‌,  దర్శకుడు బోయపాటి, మ్యూజిక్ డైరక్టర్ తమన్,  హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, హాజరయ్యారు. ఈ షోలో...1995 లో టీడీపీలో జరిగిన అధికార మార్పిడి విషయంపై రియాక్టయ్యారు. ఇది జరిగి పాతికేళ్లకు పైనే  అయింది. అప్పట్లో బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ నుంచి.... ఆయన అల్లుడు, బాలకృష్ణ బావ చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్నారు. చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. ఈ అధికార మార్పిడి సమయంలో బాలకృష్ణతో సహా..ఎన్టీఆర్ కుటుంబం అంతా చంద్రబాబు వైపే ఉంది. పాతికేళ్లుగా అనేక సందర్భాల్లో వెన్నుపోటు వ్యాఖ్యలు వస్తూనే ఉన్నాయి. బహుశా బాలకృష్ణ ఈ అంశంపై  బహిరంగంగా .. నేరుగా స్పందించడం ఇదే మొదటిసారి కావచ్చు. వెన్నుపోటు అంటున్నప్పుడల్లా... తనకు కన్నీళ్లు వస్తాయని.. బాలకృష్ణ ఆవేదన చెందారు.  తాను ఆయన కొడుకునని.. ఆయన ఫాన్సులో ఒకడినని స్పందించారు. ఈ  షోలో ఆ సందర్భం ఎందుకొచ్చిందో తెలీదు కానీ.. బాలకృష్ణ దీనిపై మాత్రం చాలా ఎమోషనల్‌గా స్పందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో మాత్రమే విడుదలయింది. త్వరలో స్ట్రీమ్‌ అయ్యే ఎపిసోడ్‌లో పూర్తి వివరాలు ఉండొచ్చు. 
బాలకృష్ణ ఈ స్థాయిలో ఆవేదన చెందడానికి కారణం ఉంది. ఎన్టీఆర్‌కు ఆయన కుటుంబ సభ్యులే వెన్నుపోటు పొడిచారని రాజకీయ ప్రత్యర్థులు కొందరు పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల ఆ ప్రచారం తారాస్థాయికి చేరింది. ఎన్టీఆర్ కుమార్తె, నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై వల్లభనేని వంశీ ఓ ఇంటర్వ్యూలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు అదే విధంగా మాట్లాడారు. దానిపై చంద్రబాబు కంట తడి పెట్టుకున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు ఈ సందర్భంలోబాలకృష్ణ చేసిన ఈ  వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఉంది. 
ఈ విషయం పక్కన పెడితే ఈ షోలో బాలయ్య యథావిధిగా మళ్లీ అదరగొట్టాడు. దర్శకుడు బోయపాటి నుంచి హీరోయిన్ ప్రగ్యా వరకూ ఎవరినీ వదలకుండా సెటైర్లు వేశాడు. అవసరం అయితే తాను విలన్ గా నటించడానికి కూడా రెడీ అంటూ.. ఏ వైరైటీ కండీషన్ కూడా పెట్టాడు..చూడాలి మరి ఆ ఆఫర్‌ను ఎవరైనా స్వీకరిస్తారేమో... 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola