NTR and Ram Charan New Look: ఈ నెల 9న రిలీజ్ కానున్న ట్రైలర్
భీమ్... భీమ్... కొమరం భీమ్‌గా ,ఆర్ఆర్ఆర్ సినిమా లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఆయన లుక్ విడుదల చేశారు. టీజర్ చూపించారు. స్వాతంత్య్ర సమర యోధుడిగా... అడవిలో పులితో యుద్ధం చేసే వీరుడిగా ఎన్టీఆర్ అభినయం, ఆహార్యం ప్రేక్షకులకు నచ్చాయి. అయితే... ఇప్పుడు కొత్తగా కొమరం భీమ్ పోస్టర్ ఒకటి విడుదల చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. ఈ నెల 9న సినిమా ట్రైలర్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నందమూరి అభిమానులకు, ప్రేక్షకులకు ఈ పోస్టర్ కానుక అన్నమాట.