NBK: బాలయ్య షోలో రవితేజ గెస్ట్ గా కనిపించబోతున్నారని టాక్
నందమూరి బాలకృష్ణ రాజకీయాలతో, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. 'అన్ స్టాపబుల్' అనే షోని హోస్ట్ చేయడానికి అంగీకరించారు. తొలిసారి బాలయ్య హోస్ట్ గా షో అనేసరికి జనాల్లో ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది. పైగా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడమనేసరికి.. ఆయన ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో తెలుసుకోవాలనే కుతూహలం ప్రేక్షకుల్లో కలిగింది. దానికి తగ్గట్లుగానే పేరున్న తారలను గెస్ట్ లుగా తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇప్పటివరకు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం లాంటి తారలను తీసుకొచ్చారు.