నయన్‌కి ధనుష్ లాయర్ నోటీసులు, పోస్ట్ వైరల్

ధనుష్, నయనతార వివాదం రోజురోజుకీ ముదురుతోంది. సోషల్ మీడియాలో ఇద్దరి ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతోంది. ఈ క్రమంలోనే ధనుష్ లీగల్ టీమ్ ఇచ్చిన నోటీసులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ధనుష్ లాయర్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌పైనే నయనతార రియాక్ట్ అవుతూ ఓపెన్ లెటర్ రాసింది. అయితే...ఈ ఓపెన్ లెటర్‌తో పాటు ఇప్పుడు ఈ స్టేట్‌మెంట్ కూడా వైరల్ అవుతోంది. 24 గంటల్లో ఆ డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ దాన్‌ క్లిప్‌ని తొలగించకపోతే పది కోట్ల కట్టక తప్పదని ఈ నోటీస్‌లో తేల్చి చెప్పాడు ధనుష్ లాయర్. తన క్లైంట్‌ సినిమా ప్రొడక్షన్‌ కోసం భారీగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని, నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాకి సంబంధించిన క్లిప్స్ వాడడం కాపీరైట్స్‌ని వయలేట్ చేయడమే అవుతుందని స్పష్టం చేశాడు. 

నయనతార బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌ డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ దాన్‌ సినిమాకి సంబంధించిన 3 సెకన్ల క్లిప్‌ని వాడారు. ఈ క్లిప్‌ని వాడినందుకు 10 కోట్లు కట్టాలని ధనుష్ డిమాండ్ చేశాడు. అక్కడి నుంచే ఈ వివాదం మొదలైంది. కేవలం మూడు సెకన్ల క్లిప్‌కి అన్ని కోట్లు కట్టాలా అంటూ నయనతార సోషల్ మీడియాలో ఓపెన్ లెటర్ పోస్ట్ చేసింది. ధనుష్‌ క్యారెక్టర్‌పైనా తీవ్ర విమర్శలు చేసింది. ఇప్పుడు నయన్ 40వ బర్త్‌డే సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌లో డాక్యుమెంటరీ రిలీజ్ అయింది. రెండేళ్లుగా నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం అడుగుతున్నా ధనుష్ ఇవ్వడం లేదని, అందుకే రీ ఎడిట్ చేయించి రిలీజ్ చేయించామని చెబుతోంది నయనతార. అయితే...ఆ క్లిప్‌ని వాడినందుకు లీగల్‌గా చర్యలు తప్పవని ధనుష్ లాయర్ స్టేట్‌మెంట్ ఇవ్వడం వల్ల ఈ వివాదం మరింత ముదిరింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola