నాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్

Continues below advertisement

నాగచైతన్య, శోభితా ధూళిపాళ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు ఏర్పాటు చేసిన వేదికపై పెళ్లి చేసుకున్నారు. బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా ఈ వేడుక జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు వీళ్ల వెడ్డింగ్ వీడియో కూడా వైరల్ అవుతోంది. శోభిత మెడలో నాగచైతన్య మూడు ముళ్లు వేసిన ఈ వీడియోని అక్కినేని ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. తాళి కట్టిన వెంటనే చుట్టూ ఉన్న వాళ్లంతా గట్టిగా కేకలు వేశారు. చైతూ తమ్ముడు అఖిల్ విజిల్స్ వేశాడు. రెండేళ్లుగా నాగచైతన్య, శోభితా డేటింగ్‌లో ఉన్నారు. ఈ ఆగస్టులో ఎంగేజ్‌మెంట్ కాగా..ఇప్పుడు వివాహం జరిగింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ జంటకి భయంకరమైన నెగిటివిటీ వచ్చింది. సమంత ఫ్యాన్స్ అంతా చైపై తీవ్రంగా మండి పడుతున్నారు. అటు శోభితపైనా ఇదే స్థాయిలో ఫైర్ అవుతున్నారు. అంత ఈజీగా సమంతని ఎలా మర్చిపోయావని నాగచైతన్యని ప్రశ్నిస్తున్నారు. ఈ కాంట్రవర్సీలు అన్నీ పక్కన పెడితే పెళ్లి మాత్రం చాలా సింపుల్‌గా చేసుకున్నారు ఇద్దరు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram