పుష్ప సినిమా కోసం హైదరాబాద్‌కి వచ్చిన శిల్పారవి రెడ్డి
నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి అల్లు అర్జున్ కోసం హైదరాబాద్ వచ్చారు. పుష్ప 2 సినిమా చూసేందుకు తన ఫ్రెండ్ బన్నీ కోసం వచ్చారు. అల్లు అర్జున్‌తో కలిసి ఆర్‌టీసీ ఎక్స్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో సినిమా చూశారు. బన్నీతో కలిసి ఆయన థియేటర్‌కి వచ్చిన సమయంలో భారీగా అభిమానులు తరలి వచ్చారు. అరుపులు కేకలతో సందడి చేశారు. అంతకు ముందు సోషల్ మీడియాలో ఓ ఫొటో కూడా షేర్ చేశారు శిల్పారవి రెడ్డి. బన్నీతో కలిసి దిగిన ఫొటోనే పోస్ట్ చేశారు. విత్ వైల్డ్‌ఫైర్ అని క్యాప్షన్ కూడా పెట్టారు. అయితే...ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల బరిలో దిగిన శిల్పారవికి ప్రచారం చేశారు అల్లు అర్జున్. తన భార్యకి ఫ్రెండ్ కావడం వల్ల అక్కడికి వెళ్లి సపోర్ట్ ఇచ్చారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ బరిలోకి దిగగా...ఆయనకు సపోర్ట్ ఇవ్వకుండా ఎవరో వైసీపీ క్యాండిడేట్‌కి సపోర్ట్ చేయడమేంటని అప్పటి నుంచే ఓ రచ్చ మొదలైంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్ జరిగింది. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతోంది. ఇలాంటి సమయంలో శిల్పా రవి రెడ్డి..సినిమా చూసేందుకు నంద్యాల నుంచి హైదరాబాద్‌కి రావడం హాట్ టాపిక్ అయింది.