వినాయక నిమజ్జనం వేడుకల్లో అంబానీ ఫ్యామిలీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ, ఆయన కుటుంబం ఆదివారం రాత్రి గణేష్ నిమజ్జనం వేడుకల్లో పాల్గొన్నారు. ముకేష్ అంబానీ, నీతా అంబానీలతో పాటు కొత్తగా పెళ్లయిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్, అంబానీల బంధువు, సన్నిహితులు, పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నిమజ్జనం వేడుకల్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ సామాన్యుల్లా డ్యాన్స్‌లు వేస్తూ కనిపించారు. ఈ వేడుకల్లో అంబానీ ఫ్యామిలీ మొత్తం సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఇంతకు ముందు వినాయక చవితి వేడుకలను కూడా అంబానీ ఫ్యామిలీ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వినాయక చవితి వేడుకల్లో సల్మాన్ ఖాన్, కాజోల్, తమన్నా, ప్రముఖ దర్శకుడు అట్లీ, సచిన్ టెండూల్కర్, సంజయ్ దత్, సిద్థార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ వంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు. కొన్ని నెలల క్రితం అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహాన్ని కూడా అంబానీ ఫ్యామిలీ ఎంతో ఘనంగా జరిపింది. ఈ పెళ్లికి దేశంలోని అన్ని మూలల నుంచి సెలబ్రిటీలు హాజరయ్యారు.