Manchu Manoj | భూమా మౌనికతో మంచు మనోజ్ పెళ్లి ఫిక్స్ అయిందా..? | ABP Desam
భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె భూమౌ మౌనిక రెడ్డిని మంచు మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నారా..? ప్రస్తుతం ఈ ప్రశ్న సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. ఎందుకంటే... హైదరాబాద్ సీతాఫల్ మండిలోని ఓ వినాయక మండపానికి భూమా మౌనిక, మనోజ్ ఇద్దరు కలిసి వచ్చి గణపయ్యను దర్శించుకున్నారు. దీంతో... మౌనికతో పెళ్లి విషయంపై మీడియా మీడియా ప్రశ్నించగా.. మంచు మనోజ్ నో కామెంట్స్ అంటూ స్పందించారు. మౌనికతో కలిసి రావడం, పెళ్లి వార్తలను ఖండించక పోవడంతో వీరి పెళ్లి ఖాయమనే ప్రచారం జోరందుకుంది.