Nora Fatehi: నోరా ఫతేహీని ప్రశ్నించిన దిల్లీ పోలీసులు | ABP Desam

బాలీవుడ్ హీరోయిన్ల చుట్టు ఆర్థిక నేరస్థుడు సుకేశ్ చంద్రశేఖర్ కేసు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో భాగంగా శుక్రవారం నటి నోరా ఫతేహీని దిల్లీ పోలీసులు ప్రశ్నించారు. దాదాపు 4 గంటల పాటు పోలీసులు ఆమెను విచారించారు. 50కిపైగా ప్రశ్నలు సంధించారట. ఈ కేసులో గతంలోనూ నోరా ఫతేహీ విచారణ ఎదుర్కొంది. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అధికారులు గతంలో సుకేశ్, నోరాను ఒకేసారి ప్రశ్నించారు. అందుకు సంబంధించిన వివరాలను ఈడీ తమ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. నోరాకు సుకేశ్‌ బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. అయితే ఈ కారును తాను తిరిగిచ్చేసినట్లు నోరా విచారణ సమయంలో చెప్పింది. మరో బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ చుట్టు ఈ కేసు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఆమెను కూడా నిందితురాలిగా పేర్కొంటూ ఈడీ ఇటీవల అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola