Hema Bangalore Rave Party Issue | చిల్ అవుతున్న హేమ.. మరో కేసులో చిక్కుకుందా..! | ABP Desam

 బెంగళూరులో వెలుగులోకి వచ్చిన రేవ్ పార్టీలో తెలుగు సినీ నటి హేమ పాల్గొన్నారంటూ కన్నడ మీడియా సహా తెలుగులోనూ వస్తున్న ప్రచారంపై ఆమె స్వయంగా ఖండించారు. ఆ రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ కొట్టిపారేశారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని.. బెంగళూరు రేవ్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో అనవసరంగా తనను లాగుతున్నారని అన్నారు. అయితే బెంగుళూరు పోలీసుల మాత్రం హేమ కచ్చితంగా రిసార్ట్ లో ఉందని చెబుతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సైతం విడుదల చేశారు. కానీ ఉదయం ఓ వీడియో ద్వారా సోషల్ మీడియాలో కూడా తనపై జరుగుతున్న ప్రచారాన్ని నటి హేమ ఖండించారు. ఈ మేరకు హేమ ఓ వీడియోను విడుదల చేశారు.నేను ఏ నగరానికి వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. ఇక్కడ నా ఫామ్‌ హౌస్‌లో ఎంజాయ్‌ చేస్తున్నాను. నాపై మీడియాలో వస్తున్న వార్తలను నమ్మకండి. అదంతా ఫేక్‌ న్యూస్‌. అక్కడ ఎవరు ఉన్నారో నాకు తెలియదు. దయచేసి మీడియాలో నా మీద వస్తున్న వార్తలను నమ్మకండి’ అని హేమ కోరారు. బట్ ఇదంతా నాటకమనే వెర్షన్ మరో వచ్చింది. 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola