Game Changer Movie: రామ్ చరణ్ కోసం చిరంజీవి త్యాగం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌. ముందుగా ఈ సినిమాను డిసెంబ‌ర్‌లో క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ ఇప్పుడు వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేస్తున్నారు. ఈ విష‌యంపై చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్‌రాజు స్ప‌ష్ట‌తనిచ్చారు. ఆయ‌న మాట్లాడుతూ ‘‘‘గేమ్ చేంజర్’ను ముందుగా ఈ ఏడాది క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేశాం. కానీ సినిమాను వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్న‌ప్పుడు క్రిస్మ‌స్ కంటే సంక్రాంతి అయితే బావుంటుంద‌ని నాతో పాటు బాలీవుడ్‌, కోలీవుడ్, క‌ర్ణాట‌క‌ ఓవ‌ర్ సీస్‌లోని ఇత‌ర డిస్ట్రిబ్యూట‌ర్స్ అంద‌రూ భావించాం. ఈ ఆలోచ‌న‌ను నేను చిరంజీవిగారికి, యువీ క్రియేష‌న్స్ సంస్థ‌కు తెలియ‌జేశాం’’ అని అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola