విజువల్ వండర్‌గా విశ్వంభర, టీజర్‌లో ఇవి గమనించారా?

Continues below advertisement

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ టీజర్ రిలీజైంది. చెడును, దుష్టశక్తులను అంతం చేసే దైవ కార్యం నెరవేర్చే పాత్రలో చిరంజీవి కనిపిస్తున్నట్లుగా ఈ టీజర్ ను బట్టి తెలుస్తుంది. ఈ లైన్ ఏదైతే ఉందో అది మనం ఇంతకుముందు ఎన్నో సినిమాల్లో చూసి ఉండొచ్చు. ఇలా అరాచక శక్తులతో పోరాడే హీరోలను చాలా సినిమాల్లో మనం చూశాం. కానీ, ఈ సినిమాలో దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. పైగా A legend rises like never before అని టీజర్‌లో చెప్తూనే అంచనాల్ని విపరీతంగా పెంచేశారు. ఆ వెంటనే మెగాస్టార్ ఎగిరే రెక్కల గుర్రంపై నుంచి వస్తున్న షాట్‌తో.. మెగా అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. ఒకటిన్నర నిమిషాల టీజర్ మొత్తం విజువల్ వండర్‌గా అనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్ లో కూడా విజువల్ ఎఫెక్ట్స్ ఐ ఫీస్ట్ గా ఉన్నాయి. మెగాస్టార్ మూవీస్ లో కెల్లా ఈ రేంజ్‌లో వీఎఫ్ఎక్స్ ఉన్న సినిమా ఇదే అనిపిస్తుంది. ఇంకా టీజర్ లో వింత రకం పక్షులు, డైనోసార్స్ ని చూపించారు.. ఒక పాప కూడా చెవులు డిఫరెంట్ గా ఉండడం చూస్తే ఎన్నో రకాల డిఫరెంట్ ఎలిమెంట్స్ తో కథ ఉన్నట్లుగా అర్థమవుతుంది.

చిరంజీవి ఇంతకుముందు సోషియో ఫాంటసీ ఎలెమెంట్స్ తో అంజి అనే సినిమా తీశారు. అంతకుముందు  జగదేకవీరుడు అతిలోకసుందరి కూడా సోషియో ఫాంటసీ సినిమా నే. సో చాలాకాలం తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న  ఈ జోనర్ సినిమా  ఎలా ఉంటుంది అనేది వెయిట్ చేసి చూడాలి. ఇప్పటికే బింబిసారతో తానేంటో ప్రూవ్ చేసుకున్నారు.. డైరెక్టర్ వసిష్ఠ. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వసిష్ఠతో మెగాస్టార్ మూవీ కుదిరిందని తెలియగానే.. ఫ్యాన్స్‌లో ఆ లెవెల్ ఎక్స్‌పెక్టేషన్స్ కలిగాయి. ఇప్పుడు ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా టీజర్ ఉండడంతో ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఉన్నారు. ఇంకా దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో విశ్వంభర సినిమాని తీస్తున్నట్లుగా టాక్‌ అయితే ఉంది. చిరంజీవి కెరీర్‌లోనే ఎక్కువ బడ్జెట్‌తో ఈ సినిమాని తీస్తున్నారని కూడా అంటున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram