Daler Mehndi: రిపబ్లిక్ డే వేడుకల్లో వర్చువల్ త్రీడీలో పాడటం వింత అనుభూతి| ABP Desam
గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రముఖ గాయకుడు దలేర్ మెహందీ వర్చువల్ త్రీడీలో ఇచ్చిన కాన్సర్ట్ పై ప్రశంసలు జల్లు కురుస్తోంది. ఈ సందర్భంగా తన సంతోషాన్ని పంచుకున్న దలేర్...మెటావర్స్ మ్యాన్ గా పిలిపించుకోవటం బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. 1999లో గ్రీన్ మ్యాట్ టెక్నాలజీతో రకరకాల ప్రయోగాలు చేశానని గుర్తు చేసుకున్న దలేర్....ఇప్పుడు మెటావర్స్ వరల్డ్ లో నూ తొలి అడుగులు వేయటంపై సంతోషంవ్యక్తం చేస్తూ ఇన్ స్టా లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.