Who is dubbing for Allu Arjun in Hindi?హిందీ వెర్షన్ లో డబ్బింగ్ చెప్పేదెవరో తెలుసా?|ABP Desam

Continues below advertisement

రెగ్యులర్ గా హిందీ సినిమాలకు డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ లు కాకుండా.. బన్నీ పాత్రకు ఓ యంగ్ హీరోతో డబ్బింగ్ చెప్పించడానికి రెడీ అయ్యారు.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నారు. తొలిసారి బన్నీ ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తెలుగు సినిమాలను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేసే గోల్డ్ మైన్ ఫిలిమ్స్ సంస్థ 'పుష్ప' హిందీ హక్కులను సొంతం చేసుకుంది. ఏఏ ఫిలిమ్స్ ఈ సినిమాను నార్త్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ సంస్థ 'పుష్ప' హిందీ డబ్బింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram