Jai Bhim Movie Review : జై భీమ్ హిట్ టాక్.... డైరెక్టర్ టీఎస్ జ్ఞానవేల్ ఫుల్ జోష్
తెలుగు ప్రజలకు సుపరిచితుడైన సూర్య హీరోగా, కర్ణన్ ఫేమ్ రజీషా విజయన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ కీలకపాత్రల్లో.. కొత్త దర్శకుడు టీఎస్ జ్ఞానవేల్ రూపొందించిన సినిమా ‘జై భీమ్’. ఆకాశం నీ హద్దురా వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం తర్వాత సూర్య నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయింది. కులవ్యవస్థను బలంగా ప్రశ్నిస్తూ, అదే సమయంలో థ్రిల్లింగ్ కోర్ట్ రూం డ్రామాను చూడబోతున్నామనే ఫీలింగ్‌ను ఈ సినిమా ట్రైలర్ కలిగించింది. మరి ట్రైలర్ ఉన్నంత బలంగా సినిమా ఉందా? సూర్య మళ్లీ హిట్టు కొట్టాడా?