థంబ్సప్ బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
#MaheshBabuThumsUp #VijayDevarakondsThumsUp #ThumsUp మహేష్ బాబుకి సంబంధించిన ప్రెస్టీజియస్ బ్రాండ్ విజయ్ దేవరకొండ చేతుల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో నటించిన ఆయన 'లైగర్' సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. ఈ సినిమా రిలీజ్ కాకాకముందే విజయ్ కి బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి. కరణ్ జోహార్ లాంటి నిర్మాతతో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు విజయ్ దేవరకొండ. ఓ పక్క సినిమా షూటింగ్స్ తో ఎంతబిజీగా ఉన్నా.. కమర్షియల్ యాడ్స్ కోసం కూడా సమయం కేటాయిస్తుంటారు