Sri Valli Song: 'శ్రీ వల్లి' పాట హిట్ తో సిద్ శ్రీ రాం గురించి బన్నీ పోస్ట్ | Sid Sriram | ABP Desam
రాయలసీమ వాసిలా అల్లు అర్జున్ ఇరగదీసేసిన సినిమా పుష్ప. ఈ సినిమా టాలీవుడ్ లోనే కాక.. హిందీలోనూ ఎంత హిట్ కొట్టిందో మనందరికీ తెలిసిందే. బాలీవుడ్ హీరోలు, క్రికెటర్లు.. ఇలా ఒక్కరేమిటి అందరూ శ్రీవల్లి పాటకు స్టెప్పేసిన వారే. ఈ పాటకు ఇంత క్రేజ్ తీసుకొచ్చిన సిద్ శ్రీరాం వాయిస్ కు బన్నీ థ్యాంక్స్ చెప్పారు. అసలు తన గొంతులోనే ఏదో మ్యాజిక్ ఉందంటూ పొగిడేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సంగీతం లేకుండా పాట పాడినా... ఎంత బాగా వినిపించిందోనని మురిసిపోయారు. తన పాటకి సంగీతం అవసరం లేదు... ఎందుకంటే తనే సంగీతమంటూ ట్వీట్ చేశారు.