Skylab : సైన్స్ ఫిక్షన్ అనుకుంటున్నారేమో...నవ్వుల్లో ముంచెత్తుతాం
1979లో ప్రపంచాన్ని మొత్తం కంగారు పెట్టిన ఏకైక సంఘటన స్కైలాబ్. అమెరికా ప్రవేశపెట్టిన ఓ ఉపగ్రహం పేరు స్కైలాబ్. ఇది ఫెయిల్ అవ్వడంతో భూమి మీదకి దూసుకు వచ్చింది. దీంతో భూమిపై ఎక్కడ పడుతుందో, ఎవరు చనిపోతారో అంటూ వార్తలు అప్పట్లో సంచలనంగా నిలిచాయి. దీనికి భయపడి ఇక మనం బతికుండం అని అప్పటి ప్రజలు చేసిన పనులు ఎన్నో. కానీ చివరికి ఆ స్కైలాబ్ ఆస్ట్రేలియాకి దగ్గర్లో సముద్రంలో పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి రియల్ కథకి కామెడీ జోడించి అద్భుతమైన సినిమాగా తీసుకురాబోతున్నారు. సత్యదేవ్ హీరోగా, నిత్యామీనన్ హీరోయిన్ గా స్కైలాబ్ సినిమా రాబోతుంది. ఈ సినిమాని డిసెంబర్ 4న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఆ చిత్ర దర్శకుడు వివేక్, హీరో సత్యదేవ్ తో సరదా ఇంటర్వ్యూ