Ramya Krishna in Allu Arjun and Atlee Movie | అల్లు అర్జున్ సినిమాలో రమ్య కృష్ణ ? | ABP Desam

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకోన్ నటిస్తున్నారు. దీపికా తోపాటు మరో రెండు పాత్రల కోసం మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో రమ్య కృష్ణ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు అంటూ మరో వార్త వైరల్ గా మారింది. 

'బాహుబలి'లో రాజమాత శివగామి పాత్రలో అద్భుతమైన నటన కనబర్చి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు రమ్యకృష్ణ. ఇప్పుడు ఆమెను అల్లు అర్జున్ అట్లీ సినిమాలో కీలక‌ పాత్రకు తీసుకున్నారని అంటున్నారు. 
అయితే బన్నీ - రమ్య కృష్ణ కాంబినేషన్‌లో ఫస్ట్ సినిమా ఇది. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే ఈ సినిమాలో విలన్ రోల్ కోసం రష్మికను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే దీపికను తప్ప మరొకరిని తమ సినిమాలోకి తీసుకున్నట్లుగా మూవీ టీం అధికారికంగా వెల్లడించలేదు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola