Vijay Devarakonda Rashmika in Newyork | ఇండియన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో వైరల్ జంట | ABP Desam

 ఎప్పటి నుంచో డేటింగ్ లో ఉన్నారంటూ గాసిప్స్ వస్తున్న వైరల్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు. అది కూడా అమెరికాలో. అక్కడ న్యూయార్క్ టైమ్ స్క్రేర్ లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ నిర్వహించిన ఇండిపెండెన్స్ డే విక్టరీ పరేడ్ లో విజయ్ రష్మిక కలిసి పాల్గొన్నారు. గ్రాండ్ మార్షల్స్ హోదాలో ఈ ఈవెంట్ కు విజయ్, రష్మిక ను నిర్వాహకులు ఆహ్వానించగా..ఇద్దరూ పాల్గొనటం విశేషం. పైగా ఈ ఈవెంట్ లో నిర్వహించిన విక్టరీ పరేడ్ లో రష్మిక చేతులు పట్టుకుని విజయ్ జాగ్రత్తగా నడిపించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఓ వైపు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్, మరో వైపు లవ్ ట్రిప్ ను ఈసారి అఫీషియల్ గా నిర్వహించారని కామెంట్స్ చేస్తున్నారు ఈ ఇద్దరి మ్యూచువల్ ఫ్యాన్స్. ఈ ఇద్దరూ చాలా కాలం తర్వాత కలిసి కనిపించటంతో ఫ్యాన్స్ లో లవ్ డిక్లరేషన్ సంబరాలు కూడా మొదలయ్యాయి. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola