Rajamouli Mahesh Babu Movie: జపాన్ లో RRR స్క్రీనింగ్స్ సందర్భంగా మహేష్ మూవీ అప్డేట్ ఇచ్చిన జక్కన్న
స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం జపాన్ లో ఉన్నారని తెలిసిందేగా. వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ ట్రిపుల్ ఆర్ సినిమా స్పెషల్ స్క్రీనింగ్స్ వేస్తుంటే ముఖ్యఅతిథిగా వెళ్లారు. అక్కడ మహేష్ తో తన తర్వాతి సినిమా గురించి అప్డేట్స్ కూడా ఇచ్చారు. అందులో భాగంగానే... జపాన్ వాళ్లకు మహేష్ గురించి తెలియదేమో అని రాజమౌళి పరిచయం చేయబోయారు. అయితే పేరు చెప్పగానే వచ్చిన చీర్ విని రాజమౌళి స్వీట్ షాక్ కు గురయ్యారు.