Radheshyam First Review: సినిమాలో ఆ పార్ట్ ఎవ్వరూ ఊహించరు | Prabhas | PoojaHegde | ABP Desam

ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో Pan India మూవీ రాధేశ్యామ్ మార్చి 11న విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు అన్ని సినిమాలకి చేసినట్టే రాధేశ్యామ్ కి కూడా చాలా హై రేంజ్ లో ప్రమోషన్స్ కంటిన్యూ చేస్తున్నారు చిత్రబృందం. multi lingual film కావడంతో ఇప్పటికే ముంబై, చెన్నైలో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఫ్యాన్స్ ఎంతో excitedగా వెయిట్ చేస్తున్న ఈ సినిమాకు తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ టైంలో ఓవర్సీస్ సెన్సార్ మెంబర్, Film analyst Umar saindhu రాధేశ్యాం సినిమా చూశారంట. సినిమాలో ఏం చూశారో ట్విటర్ లో ట్వాట్ కూడా చేశారు. మూవీ చూశా.. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రభాస్-పూజాహెగ్డేల కెమిస్ట్రీ అదిరింది.. క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని అన్నారు. ఇదే కాకుండా రాధేశ్యామ్ ఒక యూనిక్ సబ్జెక్ట్ అని.. ఒక్క మాటలో చెప్పాలంటే 'రాధేశ్యామ్' క్లాసిక్, స్టైలిష్, థ్రిల్లింగ్, మిస్టరీ అండ్ రొమాంటిక్ ఫిల్మ్ అని అన్నారు. 'రాధేశ్యామ్' ఒక ఎపిక్ అని.. ప్రభాస్ అద్భుతంగా నటించారని.. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ బాగుందని అన్నారు. ఇండియాలో ప్రభాస్ క్లాస్, స్టైల్ ను బీట్ చేసేవాళ్లే లేరంటూ పొగిడేశారు. ఇంతకు ముందు కూడా ఉమర్ సైంధు చాలా రివ్యూస్ ఇచ్చినా.. ఈ రివ్యూ వల్ల రాధేశ్యామ్ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. భాగ్యశ్రీ, జగపతిబాబు, మురళీ శర్మ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. యూర‌ప్ నేప‌థ్యంలో జ‌రిగే పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిగా ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమా ఇప్పటివరకు క్రియేట్ అవుతున్న expectations reach అవుతుందా లేదా అనేది థియేటర్స్ లోనే చూడాలి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola