Pushpa Art Director : పుష్ప కోసం ఎర్రచందనం డమ్మీ దుంగలు తయారు చేశాం
Continues below advertisement
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్మింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా కోసం మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో ఎర్రచందనం వనాన్ని సృష్టించాల్సి వచ్చిందంటున్నారు ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ. డమ్మీ ఎర్రచందనం దుంగలు తయారు చేయించి మారేడుమిల్లి, కేరళ-తమిళనాడు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తుంటే...చాలా సార్లు పోలీసులు తమను పట్టుకున్నారని...నిజమైన రెడ్ శాండిల్ దొంగలనుకున్నారని ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు రామకృష్ణ.
Continues below advertisement