రెండు వారాల పాటు ఐదో ఆటకు అనుమతి
'పుష్ప' సినిమాకు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్నది పెద్ద సాయమే. అయితే... ఏపీలో అటువంటి సాయం లభించే మాత్రం కనిపించడం లేదు. తెలంగాణలో రెండు వారాల పాటు ఐదో షో వేసుకోవడానికి 'పుష్ప' సినిమాకు కెసిఆర్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అధికారులకు ఈ మేరకు ఆదేశాలు కూడా వెళ్లాయి. దాంతో శుక్రవారం ఉదయమే, ఆరు గంటల ప్రాంతాల్లో నైజాం వ్యాప్తంగా 'పుష్ప' విడుదల అవ్వడం ఖాయమని తెలుస్తోంది.