Puneeth RajKumar Dies: గుండెపోటుతో పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మృతి
Continues below advertisement
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (46) ఇక లేరు. ఇంట్లో జిమ్ చేస్తుండగా నటుడు ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే కుటుంబసభ్యులు పునీత్ ను హుటాహుటిన బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్ కు తరలించారు. వెంటిలేటర్ పై అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. గుండెపోటుతో పునీత్ మరణించారని ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. ఆయన వయస్సు 46 సంవత్సరాలు. పునీత్ రాజ్ కుమార్ ఆస్పత్రి పాలైన విషయం తెలిసిన వెంటనే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హాస్పిటల్ కు వెళ్లారు. ఇంకా పలువురు కన్నడ హీరోలు, ప్రముఖులు ఆస్పత్రికి తరలి వచ్చారు . పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఆస్పత్రి దగ్గరకు చేరుకున్నారు.
Continues below advertisement
Tags :
Kannada Hero Puneeth Rajkumar Puneeth Rajkumar Puneeth Rajkumar Death News Puneeth Rajkumar Passed Away Puneeth Rajkumar Dies Appu