Priety Zinta: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రీతి జింతా...సోషల్ మీడియాలో పోస్టు వైరల్

ప్రీతి జింతా బాలీవుడ్ హీరోయిన్ అయినా తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన నాయికే. వెంకటేష్‌తో ప్రేమంటే ఇదేరా, మహేష్ బాబుతో రాజకుమారుడు సినిమాల్లో నటించింది. ఆ రెండూ సినిమాలు సూపర్ హిట్టు కొట్టాయి. తరువాత ఆమె పూర్తిగా హిందీ సినిమాలకే పరిమితమైంది. 2016లో తన అమెరికన్ అయిన జీన్ గుడెనఫ్‌ని లాస్ ఏంజలస్‌లో పెళ్లి చేసుకుంది. అప్పట్నించి భర్తతో పాటూ అక్కడే సెటిలైంది. సినిమాలకు కూడా దూరంగా ఉంటూ వచ్చింది. 46 ఏళ్ల ప్రీతి జింతా తాను తల్లయినట్టు సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకుంది. కవలలు పుట్టారని ఆనందాన్ని పంచుకుంది. కొడుకు జై జింతా గుడెనఫ్, కూతురు జియా జింతా గుడెనఫ్ ఈ లోకంలోకి వచ్చారని సంబరంగా చెప్పింది. అయితే ప్రీతి జింతా వారిని కనలేదు. సరోగసీ పద్దతి ద్వారా ప్రీతి జంట కవలలకు జన్మనిచ్చారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola