Nandamuri Kalyan Chakravarthy : శోభన్ బాబు, కృష్ణకు రీప్లేస్ అనిపించుకున్న హీరో ఏమయ్యారు
తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీ అంటే ఓ స్పెషల్ క్రేజ్. అన్న నందమూరి తారకరామరావు వారసులుగా ఆయన తర్వాత మరో రెండు తరాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. హరికృష్ణ, బాలకృష్ణ రెండో తరానికి ప్రాతినిథ్యం వహిస్తే...జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న లాంటి వాళ్లు మూడో తరం హీరోలుగా ఇండస్ట్రీలో మంచి పేరే తెచ్చుకున్నారు. అయితే వీళ్లందరి మధ్యలో ఓ నందమూరి నటుడి ప్రస్థానం...చాలా ఆశల మధ్య ప్రారంభమై..అనుకోకుండా ముగిసిపోయింది. ఇంతకీ ఎవరనేగా అతనే నందమూరి కళ్యాణ చక్రవర్తి.