Mukesh Ambani: ద్వారకనాథీశుని ఆశీస్సులతో ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగిందన్న ముకేష్ అంబానీ

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక మూడు రోజుల క్రితం ఘనంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకకు.... వాళ్లూ వీళ్లూ అని లేదు. దేశవిదేశాల నుంచి ఎందరో ప్రముఖులు,సెలబ్రిటీలు తరలివచ్చారు. మెటా సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ నుంచి పాప్ స్టార్ రిహానా దాకా, బాలీవుడ్, క్రికెట్ స్టార్ల నుంచి మన మెగా పవర్ స్టార్ రాంచరణ్ దాకా ఈ వేడుకలో సందడి చేశారు. వేడుకలు విజయవంతంగా ముగిసిన తర్వాత వీటి గురించి అనంత్ అంబానీ తండ్రి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ మాట్లాడారు. ద్వారకానాథీశుని ఆశీస్సులతో ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగిందన్నారు. సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు అంతర్జాతీయంగా అందరికీ జాంనగర్ గురించి తెలిసిందని ముకేష్ అంబానీ అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola