ఏపీలో సీజ్ అయిన థియేటర్లు తిరిగి తెరుచుకునే అవకాశం
Continues below advertisement
ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరటనిస్తూ మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు. సీజ్ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్ చేసుకునేందుకు అనుమతిచ్చారు. థియేటర్లలో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. అందుకు గానూ నెలరోజుల గడువు ఇచ్చారు. మంత్రి హామీతో 9 జిల్లాల్లో 83 థియేటర్లకు ఊరట లభించనుంది. సడలింపుల పై జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఆదేశాలిచ్చారు.
Continues below advertisement