సాహిత్య అకాడమీ పురస్కారాల్లో తెలుగు రచయితల విజయబావుటా
కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. వెంకన్న రచించిన వల్లంకి తాళం కవితా సంపుటి సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైంది. జానపద కవిగా, రచయితగా ఎంతో పేరు సంపాదించుకున్న గోరటి వెంకన్న...కుబుసం చిత్రం కోసం రాసిన పల్లె కన్నీరు పెడుతోంది రో..పాట ద్వారా అశేష ప్రజాదరణ పొందారు. నాగర్ కర్నూలు జిల్లా గౌరారం గ్రామంలో జన్మించిన గోరటి వెంకన్న రాసిన వల్లంకి తాళం...కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. అభ్యుదయ రచయిత దేవరాజ్ మహరాజ్ కి కేంద్ర బాలసాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించగా...యువరచయిత తగుళ్ల గోపాల్ కు కేంద్ర యువ సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది.