మోహన్ బాబు యూనివర్సిటీలో వివాదం, మంచు మనోజ్ సెన్సేషనల్ ట్వీట్

Continues below advertisement

మంచు ఫ్యామిలీలో మరో వివాదం మొదలైంది. ఇప్పటికే మంచు విష్ణు, మనోజ్ మధ్య గొడవలు రచ్చకెక్కాయి. అన్నదమ్ములు ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉంటున్నారు. ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ వివాదంతో మరోసారి ఈ మనస్పర్దలు బయటపడ్డాయి. ఈ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఫీజుల కోసం బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రులూ యూనివర్సిటీ యాజమాన్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వివాదం కాస్తా AICTE వరకూ వెళ్లింది. ఈ మొత్తం వ్యవహారంలో ట్విస్ట్ ఏంటంటే...ఈ ఆరోపణలు చేసిన వారికి మద్దతుగా మంచు మనోజ్ పోస్ట్ పెట్టాడు. యూనివర్సిటీపై ఇలాంటి ఆరోపణలు రావడం చాలా బాధగా ఉందని చెప్పాడు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌తో అప్పుడే మాట్లాడానని కూడా పోస్ట్‌లో మెన్షన్ చేశాడు. అంతే కాదు. ఏమైనా కంప్లెయింట్స్ ఉంటే చెప్పాలని ప్రత్యేకంగా ఓ మెయిల్ ఐడీ కూడా ఇచ్చాడు. ఇప్పటి వరకూ అయితే మోహన్ బాబు ఈ వివాదంపై మాట్లాడలేదు. ఇప్పుడు యూనివర్సిటీ బాధ్యతలంతా మంచు విష్ణు చేతుల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram