బిగ్‌బీ కేబీసీ షోలో పవన్‌ కల్యాణ్‌పై ప్రశ్న, ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ పేరు ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో గెలిచి ఏపీ డిప్యుటీ సీఎం అయ్యాక ఆయన పేరు ఇంకాస్త ఎక్కువగా మారుమోగుతోంది. ఆయన ఇమేజ్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ పేరు మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌ అయింది. అదేమీ సినిమా అప్‌డేట్ కాదు. కానీ..అదే రేంజ్‌లో ఆ వార్త వైరల్ అవుతోంది. అమితాబ్ బచ్చన్‌ హోస్ట్ చేస్తున్న కౌన్‌ బనేగా కరోడ్‌ పతి షో ఎంత పాపులరో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ షోలో బిగ్‌బీ పవన్ కల్యాణ్ గురించి ఓ ప్రశ్న అడిగారు. 2024లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌కి డిప్యుటీ సీఎం అయిన యాక్టర్ ఎవరు అని కంటిస్టెంట్‌లను ప్రశ్నించారు. ఆ స్క్రీన్‌పై నాలుగు పేర్లు కనిపించాయి. మొదటిది పవన్ కల్యాణ్‌ది కాగా, మిగతా మూడు పేర్లు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణవి. అయితే..కంటిస్టెంట్‌లు కాస్త కన్‌ఫ్యూజ్ అయి ఆడియెన్స్ పోల్ లైఫ్‌లైన్ వాడారు. ఇందులో 50% మందికిపైగా పవన్ కల్యాణ్ పేరునే కన్‌ఫమ్ చేశారు. వెంటనే పవన్ కల్యాణ్ పేరుని లాక్ చేసిన కంటిస్టెంట్‌లు...సరైన సమాధానం చెప్పి లక్షా 60 వేల రూపాయలు గెలుచుకున్నారు. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ...పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola