Manchu Lakshmi Teach For Change Fundraiser: Ramp Walk చేసిన టాప్ హీరోయిన్స్..! | ABP Desam
నటి, నిర్మాత మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ఎన్జీవో టీచ్ ఫర్ చేంజ్ ఫండ్ రైజింగ్ కోసం నిర్వహించిన ఈవెంట్ కు చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ర్యాంప్ వాక్ చేశారు. హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్, ఫరియా అబ్దుల్లా, సీరత్ కపూర్, ప్రగ్యా జైస్వాల్, హెబ్బా పటేల్, హీరో నవదీప్, యాంకర్ ప్రదీప్ మాచిరాజు, స్టార్ బ్యాడ్మింటన్ కపుల్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్.... ఇలా అందరూ ర్యాంప్ పై నడిచారు. టీచ్ ఫర్ చేంజ్ ఎన్జీవో ద్వారా పేదలకు నాణ్యమైన విద్య అందేలా మంచు లక్ష్మి చూస్తున్నారు. ఇది ఈ ఎన్జీవో కోసం నిర్వహించిన 8వ ఫండ్ రైజర్.