Khiladi Director: ఖిలాడీ డైరెక్టర్ కి రేంజ్ రోవర్ గిఫ్ట్ | Range Rover | ABP Desam
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'ఖిలాడీ' డైరెక్టర్ రమేష్ వర్మకు ఒకరు రేంజ్ రోవర్ గిఫ్ట్ ఇచ్చారు. ఎవరో తెలుసా.. ప్రొడ్యూసర్ కోనేరు సత్యనారాయణ రూ. 1.15 కోట్లు విలువైన కారును బహుమతిగా ఇచ్చారు. ఖిలాడి సినిమాకు దర్శకత్వం వహించినందుకు గానూ కార్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.