హర్షవర్ధన్ ద‌ర్శ‌క‌త్వంలో హీరో సుధీర్ బాబు కెరీర్‌లో 15వ సినిమా షురూ

హీరో సుధీర్ బాబు కెరీర్‌లో 15వ చిత్రంగా హర్షవర్ధన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు. సోనాలి నారంగ్‌, సృష్టి స‌మ‌ర్ఫ‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.5గా నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సుధీర్ బాబు కోసం ఒక భిన్న‌మైన క‌థ‌ను రెడీ చేశారు ద‌ర్శ‌కుడు హ‌ర్ష వ‌ర్ధ‌న్‌. ఈ సినిమాలో ఇంత వ‌ర‌కూ చూడ‌ని స‌రికొత్త అవతారంలో సుధీర్ బాబు క‌నిపించ‌నున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola