బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ తో పాటు సన్నీ, షన్నూ గెలుచుకున్నవి ఇవే..!

Continues below advertisement

ఎట్టకేలకు ‘బిగ్ బాస్’ సీజన్ 5 ముగిసింది. అత్యధిక ఓట్లతో బిగ్ బాస్ ట్రోపీని.. ప్రజల మనసును గెలుచుకున్నాడు. యూట్యూబ్ స్టార్ షన్ముఖ్ జస్వంత్ రన్నరప్‌గా నిలిచాడు. ఎంతో ఉత్కంఠత మధ్య ‘బిగ్ బాస్’ హోస్ట్ అక్కినేని నాగార్జున.. వీజే సన్నీని విన్నర్‌గా ప్రకటించారు. అయితే.. ఎప్పుడూ విన్నర్, రన్నరప్‌ను స్టేజ్‌పైకి తీసుకొచ్చి అనౌన్స్ చేస్తుంటారు. కానీ ఈసారి హౌస్ నుంచే నేరుగా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో చెప్తామని నాగార్జున కాసేపు షన్ను, సన్నీలతో ఆడుకున్నారు. నటి ఫరియా అబ్దుల్లాను హౌస్ లోకి పంపించి షణ్ముఖ్, సన్నీల టెన్షన్ తగ్గించే ప్రయత్నం చేశారు. వారితో కలిసి సన్నీ, షన్నులు డాన్స్ చేసి ఒత్తిడి తగ్గించుకొనే ప్రయత్నం చేశారు. అనంతరం వారిద్దరితో చిన్న గేమ్ ఫరియా చిన్న గేమ్ ఆడించింది. అందులో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో చెప్పకుండా టెన్షన్ పెట్టారు. ‘బిగ్ బాస్’ మీతో గేమ్ ఆడారంటూ.. నాగార్జున వారిని మరింత టెన్షన్ పెట్టారు. ఎట్టకేలకు నాగార్జున హౌస్‌లోకి వెళ్లి సన్నీ, షన్నులను స్టేజ్ మీదకు తీసుకొచ్చి.. ఎప్పటిలాగానే విజేతను ప్రకటించారు. విజేత ఎవరో ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. మరి, 105 రోజులు ఇంట్లో ఉన్న అతడికి నజరానాగా ఏమేమి లభించనున్నాయో తెలుసా?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram