Eagle Opts Out Of Sankranthi Box Office: విపరీతమైన పోటీ మధ్య సంక్రాంతి నుంచి వెనక్కి తగ్గిన మాస్ మహారాజా..?

ఈసారి సంక్రాంతికి బాక్సాఫీస్ చాలా ఎగ్జైటింగ్ గా కనిపిస్తోంది. తెలుగులో ఐదు సినిమాలు ఉన్నాయి. వీటితో పాటుగా డబ్బింగ్ సినిమాలు కూడా దిగుతున్నాయి. ఇన్ని సినిమాలకు థియేటర్లు ఎలా కేటాయిస్తారనే చర్చ అంతటా నెలకొంది. అన్ని సినిమాలకన్నా గుంటూరు కారం సినిమాకు ఎక్కువ క్రేజ్ ఉంది కాబట్టి, దానికే ఎక్కువ థియేటర్లు లభించడం ఖాయం. సరిపడా థియేటర్లు దొరక్కపోతే మిగతా సినిమాలు ఓపెనింగ్స్ కోల్పోయే ప్రమాదముంది. అందుకే రేసులో నుంచి వెనక్కి తగ్గాలని మాస్ మహారాజా రవితేజ ఆలోచిస్తున్నాడంట.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola