బన్నీ బొమ్మను అద్భుతంగా గీసిన మౌత్ ఆర్టిస్ట్
శ్రీకాకుళం జిల్లాకు చెందిన స్వప్నిక మౌత్ ఆర్టిస్ట్. చేతులు లేకపోయినా నోటితో డ్రాయింగ్స్ వేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తన అద్భుతమైన కళతో ఎన్నో ప్రసంశలు అందుకుంది. అల్లు అర్జున్ కొత్త సినిమా పుష్ప విడుదల సందర్భంగా బన్నీ బొమ్మను నోటితో వేసి, అల్లు అర్జున్ ఫాన్స్ కోసం వేశానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.