Christopher nolan Movies Decode Telugu | టైమ్ తో ఫుట్ బాల్ ఆడతాడు..సైన్స్ ఫిక్షన్ తో బుర్ర తినేస్తాడు..| ABP Desam

   ఓ సినిమాలో బిల్డింగులపైకి బిల్డింగులు చేరతాయి..ప్రపంచం మొత్తం తలకిందులు అవటం కాదు..త్రీడీలోనే కనిపిస్తుంది.  మరో సినిమాలో మనిషి ఊహించటానికి కూడా సాహసించని బ్లాక్ హోల్ దగ్గరకి ఓ స్పేస్ మిషన్ వెళ్తుంది. ఇంకో సినిమాలో సగం ప్రపంచం కాలంలో ఫార్వర్డ్ డైరెక్షన్ లో ముందుకు వెళ్తుంటే..మరో సగం ప్రపంచం కాలంలో వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఎన్నో అంతుపట్టని థియరీలు..ఊహకంది లాజిక్కులు..ఆయన తీసే సినిమాలను అర్థం చేసుకోవాలన్నా కూడా మనకు మినిమం డిగ్రీ ఉండాలి..కింది స్థాయి వాళ్లకు అర్థం కాదు అన్నట్లు ఉంటుంది పరిస్థితి. సైన్స్ ఫిక్షన్ అనే పదాన్ని ఇంత అందంగా వెండితెరపై ఆవిష్కృతం చేసి...సినీ ప్రేమికులకు సరికొత్త సైన్స్ పాఠాలు నేర్పే ఆ క్రియేటివ్ జీనియస్సే క్రిస్టోఫర్ ఎడ్వర్డ్ నోలన్. ఈ వారం హాలీవుడ్ ఇన్ సైడర్ నోలన్ స్పెషల్.నోలన్ సినిమాలు ఇప్పటివరకూ మీరు చూడకపోతే కచ్చితంగా చూడాల్సిన ఐదు సినిమాలు మాత్రం
1. ఇన్ సెప్షన్ 
2. ఇంటర్ స్టెల్లార్
3. ప్రెస్టీజ్
4. డార్క్ నైట్
5. డన్ కర్క్

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola